పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని గిలానీ …కుమారుడు కాశిం గిలానీ ఇవాళ(శనివారం, జూన్-13) ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తండ్రికి కరోనా బారిన పడటానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) బాధ్యులని ఆరోపించారు.

