
= పాక్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు!
= సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది
= షహబాజ్ పిరికి వాడు.. అందుకే మోదీ పేరెత్తడం లేదు
= పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ ఆగ్రహం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ పార్లమెంటులో సాక్షాత్తూ ఓ ఎంపీ కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని “యా ఖుదా, ఆజ్ బచా లో” ( ఓ దేవుడా.. ఈ రోజు మమ్మల్ని రక్షించు)అని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ పై ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి.
“సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు, వారు యుద్ధంలో ఓడిపోతారు.” అని పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ అన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ “పిరికివాడు” అని అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని ఆరోపించారు.
సరిహద్దులో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారని, కానీ ప్రధానమంత్రే స్వయంగా పిరికివాడన్నారు. మోదీ పేరును తీసుకోలేనప్పుడు, ముందు వరుసలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నామని ప్రశ్నించారు.