భారత్‌తో చర్చలకు రెడీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అడ్డు

భారత్‌తో చర్చలకు రెడీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అడ్డు

తాష్కెంట్: యూరీ, పుల్వామా అటాక్‌ల తర్వాత భారత్, పాకిస్థాన్ సంబంధాల్లో స్తబ్ధత నెలకొంది. అయితే ఇరు దేశాలు మళ్లీ కలవడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కరోనా టైమ్‌లో దాయాది దేశానికి వ్యాక్సిన్‌లు పంపి భారత్‌ మానవత్వాన్ని చాటుకుంది. కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా అల్లల్లాడుతున్న సమయంలో అవసరమైన సాయం అందించేందుకు తాము రెడీ అని పాక్ ప్రకటించింది. కానీ టెర్రర్ అటాక్‌ల్లో సూత్రధారులను తమ వద్దే పెట్టుకొని చర్యలు తీసుకోవడపోవడంతో పాక్‌పై భారత్ సీరియస్‌గా ఉంది. అయితే ఇరు దేశాల సంబంధాలపై ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త రాగం అందుకున్నారు. భారత్‌తో స్నేహాన్నే కోరుకుంటున్నామని, కానీ దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతం అడ్డొస్తోందని ఇమ్రాన్ అన్నారు. 

ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో నిర్వహించిన సెంట్రల్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో సంబంధాల గురించి ఓ జర్నలిస్ట్‌ ఇమ్రాన్‌ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. చర్చలు, ఉగ్రవాదం కలసి ముందుకు వెళ్లగలవా అని క్వశ్చన్ అడిగారు. దీనికి సమాధానంగా.. ఇరు దేశాల సంబంధాలకు మధ్య ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అడ్డొస్తోందని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇండియాతో చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.