ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు మరోసారి సందిగ్ధంలో పడ్డాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలకు హార్మూజ్ బ్లాకేడ్ ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పినట్లు ‘రాయిటర్స్’ వార్తాసంస్థ కథనం వెలువరించింది. దీనిపై ట్రంప్ సానుకూలంగా స్పందించారని, తమ సలహా పరిశీలిస్తానని అన్నట్లు పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ఖండించారు.

