న్యూఢిల్లీ: సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ 556వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌లోని నంకానా సాహిబ్ గురుద్వారా(గురునానక్ పుట్టిన ప్రదేశం)కు వెళ్తున్న 14 మంది భారత హిందూ యాత్రికులను పాక్ అధికారులు అడ్డుకుని, తిరిగి వెనక్కి పంపించారు. వేడుకల్లో పాల్గొనేందుకు మన దేశం నుంచి దాదాపు 2,100 మంది సిక్కులు పాకిస్తాన్‌కు చేరుకున్నారు.
అందరినీ తనిఖీ చేయగా 14 మంది హిందువులు ఉన్నట్లు గుర్తించారు. "మీరు హిందువులు.. కాబట్టి సిక్కు భక్తులతో కలిసి పాక్ లో ఎంట్రీకి అనుమతించం" అని ఢిల్లీ, లక్నోకు చెందిన14 మందినిని పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు రిటర్న్ పంపించారు. వీసాలు ఉన్నప్పటికీ బార్డర్ అవతల మతం ఆధారంగా ఎంట్రీ నిరాకరించారు. హోంశాఖ అనుమతిలేదంటూ స్వతంత్రంగా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న 300 మందిని కూడా పాక్ అధికారులు తిప్పి పంపించేశారు.
