ఇద్దరు ఇండియన్ పైలట్లను అరెస్ట్ చేశాం: పాక్

ఇద్దరు ఇండియన్ పైలట్లను అరెస్ట్ చేశాం: పాక్
pakistan arrested indian pilot and aircraft shots

భార‌త్‌కు చెందిన యుద్ధ విమానాల‌ను కూల్చేసిన‌ట్లు పాక్ చెబుతోంది.  అంతే కాదు విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆ దేశ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది పాక్ మిలిట‌రీ. అందులో అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. అరెస్టు చేసిన పైల‌ట్‌తో వీడియోలో మాట్లాడించారు. భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్న ఆయన తన పేరు వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ అని తెలిపాడు. స‌ర్వీస్ నెంబ‌ర్ 27981 అని..  పైల‌ట్‌ అని చెప్పాడు. హిందూ మ‌తం అని కూడా ఆ వీడియోలో  పైల‌ట్ తెలిపాడు.

మ‌రింత స‌మాచారం కావాల‌ని అధికారులు అడగ్గా.. తాను ఇంతే చెప్ప‌గ‌ల‌న‌న్నాడు. పాక్‌కు చెందిన జియో ఛాన‌ల్ ఆ వీడియోను విడుదల చేసింది. గాయ‌ప‌డ్డ మ‌రో పైల‌ట్ ప్ర‌స్తుతం చికిత్స‌లో ఉన్న‌ట్లు పాక్ వెల్ల‌డించింది.

అయితే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్‌ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.