బులవాయో: కమ్రాన్ గులామ్ (103) సెంచరీకి తోడుగా అబ్దుల్లా షఫీక్ (50) రాణించడంతో.. గురువారం జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 99 రన్స్ తేడాతో జింబాబ్వేపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 303/6 స్కోరు చేసింది. సైమ్ అయూబ్ (31), మహ్మద్ రిజ్వాన్ (37), సల్మాన్ ఆగా (30), తయ్యబ్ తాహిర్ (29 నాటౌట్) రాణించారు. కమ్రాన్.. షఫీక్‌తో రెండో వికెట్‌కు 54, రిజ్వాన్‌తో మూడో వికెట్‌కు 89 రన్స్ జోడించాడు. తర్వాత జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 రన్స్‌కే ఆలౌటైంది. ఎర్విన్ (51) టాప్ స్కోరర్. బెనెట్ (37), సీన్ విలియమ్స్ (24), మరుమణి (24) పోరాడి విఫలమయ్యారు. గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సైమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.