ఈసారి ఇండియాపై గెలుస్తాం: ఇంజమామ్‌

ఈసారి ఇండియాపై గెలుస్తాం: ఇంజమామ్‌
  • వరల్డ్‌ కప్‌ సెలెక్షన్‌ అంత తేలిక కాదు
  • ఇండియాతో సహా అన్నిజట్లను ఓడిస్తాం
  • ఇంజమామ్ వ్యాఖ్యలు

కరాచీ: వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఇండియాపై.. పాకిస్థాన్‌  ఒక్కసారి కూడా గెలువలేదు. మెగాటోర్నీలో ఆడిన ఆరుసార్లు దాయాది జట్టుకు ఓటములే ఎదురయ్యాయి. అయితే ఈసారి మెగా ఈవెంట్‌ లో తమ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేస్తామని పాక్‌ చీఫ్‌‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ధీమా వ్యక్తం చేశాడు.

‘ఇండో–పాక్‌ మ్యాచ్‌ ను ప్రజలు చాలా సీరియస్‌ గా తీసుకుంటారు. ప్రపంచకప్‌ లో ఈసారి కేవలం టీమిండియాపై గెలిచినా సరే మా అభిమానులు ఆనందపడుతారు.ఏదేమైనా మా పరాజయాలకు అడ్డుకట్ట వేస్తామనే ఆశిస్తున్నాం . ఈ టోర్నీలో ఇండియాతో సహా అన్నిజట్లను ఓడించే సత్తా మాకు ఉంది’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌ కు ఎంపిక చేసిన జట్టులోచివరి నిమిషంలో పలు మార్పు లు చేసిన ఇంజమామ్‌ .. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.‘ప్రజలు అనుకున్నట్లు గా ఓ 14–15 మందితో జట్టును ఎంపిక చేస్తే సరిపోదు. వరల్డ్‌ కప్‌ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఫాస్ట్‌ బౌలర్ల ఎంపికకు చాలా శ్రమించా. ఆమిర్‌ , జునైద్‌ , షేన్వారీతో పాటు చాలా మంది ఉన్నారు. వీళ్లలో ఎవర్ని తీసుకోవాలన్నదానిపై చాలా కసరత్తు లు చేయాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఏ జట్టును తేలికగా తీసుకోరాదు. అఫ్గాన్‌ కూడా పెద్ద టీమ్‌ లకు షాక్‌ ఇవ్వగలదు. ప్రతి మ్యాచ్‌ ప్రధానమే. పాక్‌ , ఇంగ్లం డ్‌ , ఇండియా, న్యూజిలాండ్‌ సెమీస్‌ కు చేరుకుంటాయని భావిస్తున్ నా’ అని ఇంజమామ్‌ వ్యాఖ్యానించాడు.