ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట

ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట

-నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ పేరు. పాక్ పార్లమెంటులో తీర్మానం చేయనున్నారు

నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ పేరు ప్రతిపాదించనున్నారా? పాక్ పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించి నోబెల్ అకాడమీకి పంపనుందా? దీనికి పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి ఔననే అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదలచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని.. ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించారని అన్నారు. ఇది కనుక జరుగక పోతే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేదని చెప్పారు. ఇమ్రాన్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని అన్నారు.  నేషనల్ అసెంబ్లీ (దిగువ సభ) సెక్రటరీయెట్ కు తీర్మానం ప్రతిని పంపినట్లు చెప్పారు. సోమవారం ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు మెజార్టీ ఉన్నందున తీర్మానం ఆమోదం సులువే. అయితే ఈ తీర్మానాన్ని ప్రతిపక్షపార్టీలు సమర్థిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.