World Cup 2023: తలొగ్గిన పాక్ ప్రభుత్వం.. భారత పర్యటనకు గ్రీన్ సిగ్నల్

World Cup 2023: తలొగ్గిన పాక్ ప్రభుత్వం.. భారత పర్యటనకు గ్రీన్ సిగ్నల్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? లేదా? అన్న విషయంపై అనిశ్చితి వీడింది. భారత పర్యటనకు.. పాక్ జట్టుకు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదన్న పాక్ ప్రభుత్వం..  తమ జట్టును ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు భారతదేశానికి పంపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టును.. పాకిస్థాన్‌ పంపేందుకు నిరాకరించడాన్ని భారత ప్రభుత్వం యొక్క మొండి వైఖరిగా వర్ణించింది. అయితే పాక్ క్రికెట్ జట్టు భద్రతపై షహనాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ), భారత అధికారులు తగినంత భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.