
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడి తర్వాత మే 7న ఆపరేషన్ సిందూర్ తో సత్తా చూపించామని ఈ సందర్భంగా చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు. భారత సైన్యం ధైర్య సాహసాలు చూపించిందని కొనియాడారు. దేశం తరఫున సైన్యానికి ధన్యవాదాలు చెప్తున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరిందని అన్నారు మోదీ. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీసుకుందని, పాక్ లోని టెర్రర్ క్యాంపులతో పాటు ఆర్మీ బేస్ లను ధ్వంస చేశామని చెప్పారు. దేశంలోని అక్కలు, చెళ్లెల్లకు ఆపరేషన్ సిందూర్ అంకితమిస్తున్నట్లు చెప్పారు.
పహల్గాం ఘటన ఒక పీడకల అని, మతాన్ని అడిగి మరీ చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం ముందే చంపేయడం దారుణమని అన్నారు.