పాకిస్తాన్​ పై ప్రకృతి ఆగ్రహం : 4.0 తీవ్రతతో దాయాది దేశంలో భూకంపం

పాకిస్తాన్​ పై ప్రకృతి ఆగ్రహం :  4.0 తీవ్రతతో దాయాది దేశంలో భూకంపం

భారత.. పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది.  పాకిస్తాన్ వ్యూహాలను ఎక్కడికక్కడ తిప్పి కొడుతూ దాయాది దేశ ప్రతినిథులకు.. అక్కడ ఆర్మీ వర్గాలకు.. మరీ  ముఖ్యంగా పాక్​ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలకు  భారత సైన్యం  ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత సైన్యానికి తోడుగా ఉన్నానంటూ ప్రకృతి కూడా పాక్​ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.  శనివారం తెల్లవారు జామున 01.44 లకు ( మే 9 వ తేది అర్దరాత్రి.. తెల్లవారితే  10 వతేది)  పాకిస్తాన్​ లో భూమి కంపించింది. 

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం..  భూకంప తీవ్రత  రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం ...  66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైందని తెలిపింది.భూకంపం కారణంగా, ప్రజలు  భయాందోళనతో పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎంత నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.