ఆ ఎయిర్ బేస్ ను మళ్లీ నిర్మిస్తున్న పాక్

ఆ ఎయిర్ బేస్ ను  మళ్లీ నిర్మిస్తున్న పాక్

ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ లో ఇండియా క్షిపణి దాడులతో ధ్వంసం చేసిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటోంది. దీనికి  సంబంధించిన శాటిలైట్ ఫొటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఇండియన్ ఆర్మీ  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోని రెండు స్పెషల్ పర్పస్ వెహికిల్స్ పూర్తిగా నాశనమయ్యాయి. ఎయిర్ బేస్ చుట్టుపక్కల ప్రాంతం కూడా ధ్వంసమైంది.