పాక్ ఆర్థిక శాఖ ఎక్స్ ఖాతా హ్యాక్!

పాక్ ఆర్థిక శాఖ ఎక్స్ ఖాతా హ్యాక్!

ఇస్లామాబాద్: తమ దేశ ఆర్థిక శాఖకు చెందిన ఎక్స్(ట్విటర్) ఖాతా హ్యాక్ అయినట్లు పాకిస్తాన్ శుక్రవారం ప్రకటించింది. అంతర్జాతీయ రుణాల కోసం తాము అభ్యర్థించలేదని తెలిపింది. తమ ఎక్స్ అకౌంటును హ్యాక్ చేసిన వ్యక్తే అంతర్జాతీయ రుణాలు కావాలంటూ ఫేక్ పోస్ట్ చేసినట్లు వెల్లడించింది. నిజానికి, శత్రువు వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని..అందువల్ల అంతర్జాతీయ భాగస్వాములను మరిన్ని రుణాలు కావాలని మొదట పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్ వేదికగా అభ్యర్థించింది. 

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇప్పుడు మాట మారుస్తున్నది. తమ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందని..తమపై ఫేక్ పోస్ట్ పెట్టారని బుకాయిస్తున్నది. పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ ఒక 'ఫేక్ ట్వీట్ అలర్ట్' జారీ చేసింది.  పాక్ అర్థిక శాఖ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఒక అధికారి నిర్ధారించినట్లు తెలిపింది. ఖాతాను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించింది. గురువారం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 6,000 పాయింట్లకు పైగా పతనమైన తర్వాతే ఫేక్ పోస్ట్ పెట్టారని వివరించింది.