ప్రధాని మోడీకి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు

ప్రధాని మోడీకి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు

ప్రధాని మోడీకి పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికలలో NDA మరో సారి అధికారంలోకి రానుండటంతో అభినందనలు చెప్పారు. భవిష్యత్తులో ఇరు దేశాల నడుమ శాంతియుత వాతావరణం నెలకొనాలని కోరారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇమ్రాన్ కోరారు. ఆయన కోరుకున్నట్టుగానే మోడీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో ఇమ్రాన్ సంతోషం వ్యక్తం చేశారు.