ఇయ్యాల పాక్ ప్రధాని ఇమ్రాన్ రాజీనామా?

ఇయ్యాల పాక్ ప్రధాని ఇమ్రాన్ రాజీనామా?

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్​లో జరగనున్న పబ్లిక్ ర్యాలీలోనే ఆయన తన రాజీనామాను ప్రకటించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పే చాన్స్ ఉంది. ఫారిన్ ఫండింగ్ కేసులో సోమవారం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇమ్రాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అక్రమంగా విదేశీ నిధులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.85.20 కోట్లు విరాళాలుగా స్వీకరించినట్లు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్టు అందింది. మరోవైపు ఇమ్రాన్ సర్కార్ పై ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారమే చర్చ జరుగుతుందని భావించినప్పటికీ నేషనల్ అసెంబ్లీ వాయిదా పడింది. తీర్మానంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది. ఇమ్రాన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని మిత్ర పక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండానే దిగిపోవాలని ఇమ్రాన్ ఖాన్​ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.