
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్, ఉజ్బెకిస్తాన్ లకు ఇండియన్ ట్రావెల్ సంస్థలు దీటైన జవాబు ఇచ్చాయి. ఆ మూడు దేశాలకు ట్రావెల్ ప్యాకేజీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. మన శత్రుదేశానికి మద్దతిస్తున్న ఆ మూడు దేశాలకు బుకింగ్స్ పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఈ మేరకు ఈజీ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, ట్ర వోమింట్ సంస్థలు ప్రకటించాయి.
ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు చేస్తామని ప్రకటించాయి. టర్కీ, అజర్‌బైజాన్ రెండూ పాకిస్థాన్‌కు దీర్ఘకాల మిత్ర దేశాలు, మరియు వారు పాక్‌కు రాజకీయ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ ట్రావెల్ బ్యాన్ ద్వారా భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఆ దేశాలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే, ఈ నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనేది స్పష్టంగా తెలియలేదు, కానీ ఇది భారత్-పాక్ ఉద్రిక్తతలు తగ్గే వరకు అమలులో ఉండే అవకాశం ఉంది.