కాబోయే భార్యకు.. గాడిద పిల్ల గిఫ్ట్

కాబోయే భార్యకు.. గాడిద పిల్ల గిఫ్ట్

ఇస్లామాబాద్: పెండ్లి అనేసరికి భార్య, భర్తలు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చిపుచ్చు కుంటారు. కానీ, పాకిస్తాన్​కు చెందిన యూట్యూబర్ అజ్లాన్​ షా.. తన కాబోయే భార్య వరిషా జావేద్​ఖాన్​కు వలీమా రిసెప్షన్​ సందర్భంగా ఓ గాడిద పిల్లను బహుమతిగా ఇచ్చాడు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను అజ్లాన్​షా తన ఇన్​స్టాలో పోస్టు చేయడంతో వైరల్​ అవుతున్నాయి. వీరి పెండ్లిపై పాకిస్తాన్ మొత్తం చర్చ జరుగుతున్నది. ‘‘వరీషా జావేద్​ఖాన్​కు గాడిద పిల్ల అంటే ఎంతో ఇష్టం. అందుకే నా తరఫు నుంచి ఆమెకు కానుకగా ఇచ్చాను.

బెబీ డంకీ ఆమె తల్లి నుంచి వేరు చేయను. దాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చాం”అంటూ జంతు ప్రేమికుడు అజ్లాన్ షా ఇన్​స్టాలో చెప్పాడు. వరిషా.. డాక్టర్​తో పాటు ఇన్‌‌‌‌స్టాగ్రామ్ ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్. గాడిదనే ఎందుకు గిఫ్ట్​గా ఇవ్వాలనుకున్నాడు? అనే దానికి కొందరు సోషల్ మీడియాలో  అతన్ని ప్రశ్నించగా, గాడిదంటే ఆమెకు ఇష్టం, రెండోది.. గాడిద ఎక్కువ కష్టపడి పని చేసే జంతువు అని చెప్పాడు.