పాలకుర్తిలో ఇష్యూ లేకుండా చేస్తాం: క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

పాలకుర్తిలో ఇష్యూ లేకుండా చేస్తాం: క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి కాంగ్రెస్​లో​ ఇష్యూ లేకుండా చేస్తామని ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్​ మల్లు రవి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్​లో పీసీసీ క్రమ శిక్షణ కమిటీ మీటింగ్ జరిగింది. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని హరిప్రసాద్, కిశోర్ రెడ్డిపై ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డి కంప్లైంట్ ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని, వేధింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై కూడా కంప్లైంట్ వచ్చిందని, ఇరువర్గాలను పిలిచి కమిటీ మాట్లాడుతుందన్నారు.

ఇప్పటికే కిశోర్ రెడ్డి, హరిప్రసాద్​కు షోకాజ్ నోటీసులు ఇవ్వగా వారు రిప్లై ఇచ్చారని, రికార్డు ఎవిడెన్స్ అందజేశారని చెప్పారు. ఝాన్సీరెడ్డి సైతం తన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నారు. 

ఎమ్మెల్యే విదేశాల్లో ఉండడంతో రాలేదన్నారు.  ఆమె వచ్చాక 30న కమిటీ ముందుకు రావాలని చెప్పామని పేర్కొన్నారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి, జిల్లా సీనియర్ నేతలతో ఈ అంశంపై మాట్లాడుతామన్నారు.