తమ్మినేని ఓటెయ్యలే!

తమ్మినేని ఓటెయ్యలే!

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ పాలేరు అభ్యర్థి తమ్మినేని వీర భద్రం ఈ  సారి ఓటు వేయలేదు.  ఓటరు ఐడీలో తప్పుల కారణంగా తమ్మినేని ఓటు వేయలేకపోయారు. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటును సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్నారు. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.