రేవంత్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

రేవంత్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ప్రగతి భవన్‭ను పేల్చివేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలని కోరారు. రేవంత్ చర్యలు తీసుకోవాలని లోక్‭సభ స్పీకర్‭కు విజ్ఞప్తి చేస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా తప్పుగా మాట్లాడారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ములుగులో గిరిజన యూనివర్సిటీపై కూడా రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్లా ఆరోపించారు. వర్సిటీ ఏర్పాటుకు భూమిని సేకరించిన అనంతరం సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయాన్ని పల్లా గుర్తుచేశారు. వర్సిటీ భూమి, భవనాల వివరాలు ఇస్తామని.. దానిపై కేంద్రాన్ని ప్రశ్నించమని అని రేవంత్ కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని పల్లా విమర్శించారు. సీనియర్లను కాదని ఓ బ్లాక్ మెయిలర్‭ను పీసీసీ అధ్యక్షుడుగా పెట్టుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.