కోడేరు, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో మేడి చెట్టుకు కల్లు పారుతోంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివ గౌడ్ తన ఇంటి ముందున్న మేడి చెట్టు ఏపుగా పెరగడంతో ఇటీవల కొమ్మలను కొట్టివేశాడు. తర్వాత చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతుండడంతో కొమ్మలకు కుండను తగిలించి ఆ కల్లును సేకరించాడు. ఈ కల్లు తాగితే నడుము, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని ప్రచారం కావడంతో కల్లు కోసం ఉదయం, సాయంత్రం ప్రజలు బారులుదీరుతున్నారు.
