పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవ్.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు 

పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవ్.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు 
  • గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్‌‌పై అనర్హత వేటుకు నిరాకరణ
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ 
  • పోచారం, సంజయ్ కుమార్, కాలె యాదయ్య 
  • విచారణ కూడా పూర్తి.. నేడు తీర్పు! 
  • తీర్పు కాపీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్ 
  • ఇక మిగిలింది దానం, కడియం విచారణ మాత్రమే
  • బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని 

కడియం వివరణ.. నేటికీ వివరణ ఇవ్వని దానం 

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాల్లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ తేల్చారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌‌చెరు), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరికెపూడి గాంధీ (శేరి‌‌లింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ ( రాజేంద్రనగర్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం) ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని.. వాళ్లు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి  ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ట్రిబ్యునల్​చైర్మన్​హోదాలో స్పీకర్ తీర్పు వెలువరించారు. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్ దారులు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్ల సమక్షంలో స్పీకర్​ఒక్కో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విడివిడిగా తీర్పు ఇచ్చారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని, అదే సమయంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారనేందుకు ఎలాంటి రుజువులు లేవని తేల్చారు. 

అందుకే ఆ ఐదుగురిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు. దీంతో వీళ్లంతా అనర్హత వేటు నుంచి తప్పించుకున్నట్టయింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల18న ముగియనుండగా, బుధవారమే స్పీకర్ తీర్పునివ్వడం విశేషం. కాగా, స్పీకర్ కార్యాలయం ఈ తీర్పు కాపీలను శుక్రవారం సీల్డ్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుప్రీంకోర్టుకు పంపించనుంది. 

10 మందిపై అనర్హత పిటిషన్లు.. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. అనంతరం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్​నేతలు స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారు. తాము చేసిన ఫిర్యాదులపై స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 18లోగా స్పీకర్​విచారణ పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. 

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. అయితే వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై మూడు విడతలుగా స్పీకర్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు వారి తరఫు అడ్వకేట్లను, అలాగే వీరిపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వారి తరఫు అడ్వకేట్లను విచారించారు. 

ఇరు వర్గాలు ఇచ్చిన పలు వీడియో క్లిప్పులను, ఫొటోలను, పత్రికల్లో వచ్చిన వార్తలను, ఇతర ఆధారాలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ బుధవారం  తీర్పు వెల్లడించారు. ఇక విచారణ పూర్తయిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలపై తీర్పును స్పీకర్ గురువారం వెల్లడించే అవకాశం ఉంది. శుక్రవారం తీర్పు కాపీలను సుప్రీం కోర్టుకు పంపిచాల్సి ఉండడం, ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి కావడంతో.. స్పీకర్ గురువారం తీర్పు ప్రకటిస్తారని భావిస్తున్నారు. 

తీర్పు రాగానే కడియం వివరణ.. 

దానం నాగేందర్, కడియం శ్రీహరి.. అఫిడవిట్లు దాఖలు చేయకుండా స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత గడువు కోరారు. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ఇచ్చిన అనంతరం.. బుధవారం సాయంత్రమే కడియం తన అఫిడవిట్ సమర్పించారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని, ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే స్పీకర్ దాన్ని కడియంపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు పంపించారు. దీనిపై ఆయన వివరణను స్పీకర్ తీసుకోనున్నారు. ఇక ఇప్పటికీ అఫిడవిట్ సమర్పించనిది దానం నాగేందర్ ఒక్కరే. తాను స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత గడువు కోరానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నామన్న ఎమ్మెల్యేలు.. 

విచారణకు హాజరైన సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు...ఇప్పటికీ తాము బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నామని, అందుకు పలు ఆధారాలను స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించారు. అందులో ప్రధానంగా ప్రతి నెల ఎమ్మెల్యేలుగా తమకు వచ్చే జీతం నుంచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పార్టీ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెల్లిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని వివరించారు. ఆ సందర్భంలో తమకు సీఎం కప్పిన కండువాలు కూడా కాంగ్రెస్ కండువాలు కాదని, అవి కేవలం జాతీయ పతాకం రంగులో ఉన్న కండువాలు మాత్రమేనని చెప్పారు.

వీరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం... వాళ్లంతా పార్టీ ఫిరాయించినట్లు అందుకు సంబంధించిన వీడియో క్లిప్పులను, ఫొటోలను, పేపర్ కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విచారణ సందర్భంగా స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందించారు. ఈ రెండు వర్గాల వాదనలు విన్న స్పీకర్...బుధవారం తన తీర్పులో వీటిని స్పష్టంగా పేర్కొంటూ అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ ఐదుగురు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నట్లు తన తీర్పులో వెల్లడించిన స్పీకర్...ఒక్కొక్కరిపై విడివిడిగా తీర్పు కాపీని చదువుతున్న సందర్భంలో ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ తీర్పు కాపీలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు లెజిస్లేచర్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లో ఉంచారు.