హైదరాబాద్, వెలుగు: వైఫై సర్వీసులు అందించే బెంగళూరు సంస్థ డబ్బా నెట్‌వర్క్ విస్తరణ బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం పీఎం- వాణి పథకం (ప్రధాన మంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) అమలులో భాగంగా రూపాయి నుంచే ఇంటర్నెట్ ప్యాక్‌లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ఈ పథకం ద్వారా ఎవరైనా తమ ప్రాంతంలో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ పంపిణీదారులుగా మారవచ్చు. గత ఏడాది కాలంలో డబ్బా నెట్‌వర్క్ అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 73,128 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసింది.
