విద్యుత్ తీగలు తెగిపడి పామాయిల్ తోట దగ్ధం.. రూ.10 లక్షల నష్టం

విద్యుత్ తీగలు తెగిపడి పామాయిల్ తోట దగ్ధం.. రూ.10 లక్షల నష్టం

నెక్కొండ, వెలుగు: విద్యుత్ తీగలు తెగిపడి పామాయిల్ తోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంకానిపేటకు చెందిన రైతు చీకటి శ్రీనివాస్ ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌జీఎస్ పథకం కింద పామాయిల్ తోటను పెంచారు. 

మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు వీయడంతో తోటపై నుంచి వెళ్లుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి తోటపై పడటంతో పంట పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు.