హైదరాబాద్ లో పామ్ సండే సందడి

హైదరాబాద్ లో పామ్ సండే సందడి

 ఖైరతాబాద్,వెలుగు : సిటీలో పామ్ సండేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పలు చర్చిల్లో ప్రార్థనల్లో భాగంగా చిన్నారులు, పెద్దలు ఈత మట్టలను పట్టుకుని వాటిని ఊపుతూ గీతాలు ఆలపించారు.  ఏసుక్రీస్తుకు సిలువ వేయడానికి ముందు ఆదివారం జెరుషలేంలో దారి పొడవునా వస్త్రాలు పరిచి, వాటి మీదగా గాడిదపై ఆయన తీసుకెళ్తుండగా జయము.. జయము అంటూ భక్తులు నినాదాలు చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం క్రీస్తు బోధనలను పాస్టర్లు చదివి వినిపించారు.