
మునుగోడు నియోజకవర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆమె నవంబర్ 12వ తేదీన మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. పార్టీలోకి స్రవంతికి సుముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహకరించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించదన్నారు. కోమటిరెడ్డి పార్టీలు మారి పాలనను అస్తవ్యస్తం చేశారని కేటీఆర్ విమర్శించారు.
ఉపఎన్నిక సమయంలో రేవంత్, రాజగోపాల్ రెడ్డి బకరిని ఒకరు తిట్టుకున్నారని.. కాంగ్రెస్ లో చేరగానే మళ్లీ ఇద్దరు ఒకటైపోయారని తెలిపారు. కాగా మునుగోడు కాంగ్రెస్ టికెట్ దక్కక పోవడంతో హస్తం పార్టీపై మనస్థాపం చెందిన స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు.