పాల్వంచ, వెలుగు : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లోకల్ బాడీ విభాగం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన టీచర్లకు సూచించారు. సోమవారం పాల్వంచ మండలం కరకవాగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తక్షణమే తొల గించాలని ఆదేశించారు. పాఠశాలలో 110 మంది విద్యార్థులకు 69 మంది మాత్రమే హాజరుకావడంతో అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థులు రెగ్యులర్ గా హాజరయ్యేలా చూడాలని చెప్పారు. విద్యార్థులకు ఉపయోగపడే ప్రయోగశాలతోపాటు కంప్యూటర్ ల్యాబ్, ఖాన్ అకాడమీ పాఠ్యపు స్తకాలు, ఫిజిక్స్ వాలాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, విద్యాశాఖ కో–ఆర్డినేటర్ ఎస్కే సైదులు, ప్రధానోపాధ్యాయులు ప్రకాశ్ కుమార్, పుల్లారావు, ఏపీవో రంగా, పంచాయతీ సెక్రటరీ దేవ్ సింగ్ ఉన్నారు.
