- పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్
ములకలపల్లి/అశ్వారావుపేట, వెలుగు : ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాల్వంచ డీఎస్పీసతీశ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం హైస్కూల్ లో, అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం అని, దాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

