
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామ చంద్ర స్వామి ఉత్సవమూర్తులకు బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులను ప్రాకారమండపానీకి తీసుకువచ్చారు.
పంచామృతాలతో అభిషేకం, సమస్త నదీ జలాలతో స్నపన తిరుమంజనం చేసి ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తుల సమక్షంలో నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. రాజమండ్రి కు చెందిన చార్టెడ్ అకౌంట్ భాస్కర్ రామ సీతారామచంద్ర స్వామికి నిత్య అన్నదాన పథకం కోసం రూ.2 రెండు లక్షలు విరాళంగా అందజేశారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు.