యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్కారణంగా ముంపునకు గురవుతున్న మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని... రెండు గ్రామాల్లో సర్పంచ్‌లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో గ్రామంలో ఫస్ట్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్యాకేజీ 16లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ను రూ. 1578 కోట్ల అంచనా వ్యయంతో 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి 2019లో నోటిఫికేషన్రిలీజ్చేశారు. ఈ రిజర్వాయర్ కోసం 4232 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే బండ్నిర్మాణం చాలా భాగం పూర్తయింది. అయితే ఈ రిజర్వాయర్లో నీటిని నింపితే భువనగిరి మండలంలోని బీఎన్తిమ్మాపురం, తుర్కపల్లి మండలం చోక్లానాయక్ తండా, యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండా మునిగిపోనున్నాయి. ముంపునకు గురవుతున్న లప్ప నాయక్ తండాలో ఆరు వార్డులు ఉండగా 426 మంది ఓటర్లు ఉన్నారు. చోక్లా నాయక్ తండా, బీఎన్ తిమ్మాపురం గ్రామాల్లో సర్పంచ్లు, పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 11న జరిగే మొదటి దశలో లప్ప నాయక్ తండాలో ఎన్నికలు జరగనున్నాయి.

