- కొత్త వైన్స్ షాపులకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు
- రోజుకు రూ.18 కోట్ల అమ్మకాలు
నల్గొండ/యాదాద్రి, వెలుగు: కొత్త వైన్స్ షాపులకు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. ఒక నెలలో పూర్తి కావాల్సిన ఎక్సైజ్టార్గెట్కేవలం 17 రోజుల్లోనే కంప్లీట్అయ్యింది. పంచాయతీ ఎన్ని కల్లో లిక్కర్ బిజినెస్ జోరుగా సాగింది. సాధారణంగా కొత్త షాపులు తెరిచే క్రమంలో డిపోల నుంచి వ్యాపారులు ఫుల్‌స్టాక్ కొనుగోలు చేశారు. దానికి అదనంగా ఎన్నికలు కలిసిరావడంతో వ్యాపారులు అదనపు కోటాతో షాపుల్లో ఫుల్‌స్టాక్ పెట్టారు. దీంతో పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల మద్యం సేల్స్ రెండింతలు పెరిగాయి.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రధాన పార్టీల మద్ధతుదారులు గ్రామాల్లో లిక్కర్, బీర్లను ఏరులై పారించారు. యువతను ఆకట్టుకునేందుకు బీర్లు, ఇతర ఓటర్లకు లిక్కర్‌తో మత్తులో ముంచెత్తారు. పైగా ఈసారి షాపులు వికేంద్రీకరించారు. దీంతో బెల్టుషాపుల అవసరం లేకుండా నేరుగా వై న్స్షాపుల వద్దే ఎమ్మార్పీ ధరలకే మధ్యం అందుబాటులోకి వచ్చింది.
రోజుకు సగటున రూ. 18 కోట్ల సేల్స్
రోజుకు సగటున ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 18 కోట్ల సేల్స్ జరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 17 వరకు రూ.373.81 కోట్ల విలువైన లిక్కర్ తాగేశారు. గతేడాది డిసెంబర్ 1 నుంచి 17 వరకు కేవలం రూ.152.13 కోట్ల సేల్స్ మాత్రం జరిగింది. ఈ పదిహేను రోజుల్లోనే ప్రభుత్వానికి అధనంగా రూ.215.49 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది డిసెంబర్లో 1 నుంచి 31 తేదీవర కు రూ.366 కోట్ల లిక్కర్ సేల్స్ కాగా, ఈ సారి 17 రోజుల్లోనే రూ.373.81 కోట్లు సేల్కావడం విశేషం. ఎన్నికల వల్ల సర్కార్టార్గెట్ 17 రోజుల్లోనే పూర్తియ్యింది.
ప్రీమియం బ్రాండ్లకే గిరాకీ
సాధారణంగా ఎన్నికల్లో ఆర్డనరీ లిక్కర్, బీర్లకు గిరాకీ ఉంటుంది. కానీ అభ్యర్థులు ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటుకు వెయ్యి నుంచి రూ.10వేలకు పంపిణీ చేశారు. చికెన్, మటన్, చీరల పంపిణీలో పల్లెల్లో పండగు వాతావరణాన్ని మరిపించారు. చిప్ లిక్కర్‌కు బదులు ఖరీదైన మద్యాన్ని ఓటర్లకు పంపిణీ చేయడంతో సర్కార్ ఆదాయం మరింత పెరి గింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఆర్డనరీ లిక్కర్ 18, 8 47 కాటన్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే రోజుల్లో 1,39,131 కా టన్లు సేల్ అయ్యాయి.
గతేడాదితో పోలిస్తే 1,20,284 కాటన్లు అధికం. అదేవిధంగా లిక్కర్ గతేడాది డిసెంబర్లో 25,427 కాటన్లు సేల్ కాగా, ఈ ఏడాది 3,15,188 కాటన్లు సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 2,89,761 కాటన్లు ఎక్కువ సేల్ అయ్యాయి. దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్, నల్లగొండ, నాంపల్లి సర్కిళ్ల పరిధిలోనే సేల్ రికార్డు స్థాయిలో నమోద య్యాయి.
యూత్‌కు బీర్లు... ఓటర్లకు లిక్కర్
ఉమ్మడి జిల్లాలోని 329 మద్యం షాపుల్లో ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు లిక్కర్ 3,40,615 పెట్టెలు అమ్ముడుకాగా, బీర్లు, 3,47,800 పెట్టెలు అమ్ముడయ్యాయి. గతేడాది డిసెంబర్ 1 నుంచి 15 వరకు లిక్కర్ 1,52,615 పెట్టెలు అమ్ముడుకాగా, బీర్లు 2,04, 512 పెట్టెలు సేల్ అయ్యాయి. అంటే గతేడాది డిసెంబర్‌తో పో లిస్తే లిక్కర్ 1,82,637 పెట్టెలు ఎక్కువ సేల్ కాగా, బీర్లు 1,43,283 పె ట్టెలు సేల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో లిక్కర్‌తో పోలిస్తే బీర్లు 7,185 కాటన్లు సేల్ పెరిగింది.
జిల్లా వారీగా వచ్చిన ఆదాయం వివరాలు...
జిల్లాపేరు 2024 డిసెంబర్ 2025 డిసెంబర్
నల్లగొండ రూ.68.48 రూ.172.62
సూర్యాపేట రూ.43.68 రూ.106.18
యాదాద్రి రూ.93. 28 రూ.95. 01
మొత్తం రూ.149.7 రూ.373.81
