ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: మహాశివరాత్రి ఉత్సవాలను రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గురువారం ఆమె ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలం పరిశీలించారు. అనంతరం రామప్పలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, రామప్ప ఆలయ కమిటీ నూతన చైర్మన్, కాంగ్రెస్​ వెంకటాపూర్ మండలాధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు.