జనగామ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్

జనగామ జిల్లాలో  పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్
  • జనగామ జిల్లాలో 280 జీపీలు, 
  • భూపాలపల్లి జిల్లాలో 248 జీపీ స్థానాలకు ఖరారు

జనగామ/ జయశంకర్​భూపాలపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను అధికారులు ఆదివారం ఖరారు చేశారు. సర్పంచ్​ల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఫైనల్​ చేశారు. జనగామ జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 2534 వార్డులు ఉన్నాయి. కాగా, సర్పంచ్​ స్థానాలు 65 జనరల్​, 58 జనరల్​ మహిళలకు రిజర్వ్​ అయ్యాయి. 25 బీసీ జనరల్​, 20 బీసీ మహిళకు కేటాయించారు. 31 ఎస్సీ జనరల్, 23 ఎస్సీ మహిళకు రిజర్వ్​ చేశారు. 23 ఎస్టీ జనరల్, 17 ఎస్టీ మహిళలకు కేటాయించారు. 

ఇదిలా ఉండగా జిల్లాలో ఎస్టీ జనాభా వంద శాతం ఉన్న గ్రామ పంచాయతీలు 39 ఉండగా, వాటిని ఎస్టీలకే కేటాయించారు. అలాగే, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పరిధిలోని 248 జీపీలకు రిజర్వేషన్లను ఆఫీసర్లు ఫైనల్ చేసి గెజిట్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2102 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 302,147 మంది ఓటర్లు ఉన్నారు. వందశాతం ఎస్టీలున్న గ్రామాల్లో మహిళకు రెండు స్థానాల్లో, పురుషులకు 5 స్థానాల్లో రిజర్వు చేశారు. 

ఎస్టీ కేటగిరిలో  9 జీపీల్లో మహిళలకు, 12 జీపీల్లో పురుషులకు, బీసీలకు 21 జీపీల్లో మహిళలకు, 25 జీపీల్లో పురుషులకు, జనరల్​ కేటగిరిలో 59 జీపీల్లో మహిళలకు, 64 జీపీల్లో పురుషులకు రిజర్వు చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 114 జీపీల్లో మహిళలకు రిజర్వు చేయగా, 134 జీపీల్లో పురుషులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.