
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ జూనియర్ పంచాయతీ సెక్రటరీ పుట్ట సబిత్రెడ్డి(29) వ్యక్తిగత కారణాలతో బుధవారం పల్లె ప్రకృతి వనంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం సంగమేశ్వర్‌కు చెందిన సబిత్రెడ్డి కొంతకాలంగా ఉగ్రవాయిలో జేపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతడి ఉద్యోగం కూడా రెగ్యులరైజ్అయింది.
బుధవారం తన సొంతూరు నుంచి డ్యూటీ కోసం ఉగ్రవాయికి వచ్చాడు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకోగా పంచాయతీ సిబ్బంది చూసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి నర్సింహారెడ్డి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడి వద్ద లభించిన లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.