ఉరితాళ్లకు వేలాడుతూ వినూత్న నిరసన

ఉరితాళ్లకు వేలాడుతూ వినూత్న నిరసన

మంచాల, వెలుగు : పంచాయతీ కార్మికుల సమ్మె ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. మంచాల మండల కేంద్రంలో కార్మికులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉరితాళ్లకు వేలాడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ గ్యార పాండు డిమాండ్ చేశారు. పంచాయతీ యూనియన్ నేతలు  ఖాజా పాషా, భాస్కర్, శంకరయ్య, రవి, సురేశ్, యాదయ్య, అర్జున్, నర్సింహ, వెంకటయ్య, అంజయ్య, పాండు, బీరప్ప, రోశమ్మ, చంద్రమ్మ, గంగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.