
పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గిరిపై సస్పెన్షన్ వేటు పడింది. కొన్ని నెలల కిందటే పంజాగుట్ట ట్రాఫిక్ పీఎస్లో ఇన్స్పెక్టర్గా గిరి బాధ్యతలు చేపట్టారు. కిందిస్థాయి సిబ్బందికి డ్యూటీలు వేసే విషయంలో ఏసీపీ నాగేశ్వరరావుకు, ఆయనకు మధ్య వివాదం నెలకొంది.
ఇన్ స్పెక్టర్ గిరి మద్యం తాగి కిందిస్థాయి సిబ్బంది ఒకరిపై దురుసుగా ప్రవర్తించడంతో ఏసీపీ నాగేశ్వరరావు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. ఇన్స్పెక్టర్ గిరిని సస్పెండ్ చేస్తూ సిటీ సీపీ సందీప్ శాండిల్యా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఏసీపీ నాగేశ్వరరావుని వివరణ కోరగా.. తనకేమీ తెలియదని చెప్పారు.