
ఐపీఎల్-2025 మందు వరకు.. ఐపీఎల్ అంటే పంత్ అన్నట్లుగా హైప్ క్రియేట్ చేశారు. దేశ, విదేశీ సీనియర్ ఆటగాళ్లు, ఎనలిస్టులు పంత్ బ్యాటింగ్ స్టైల్, టెక్నిక్స్ గురించి ఆకాశానికి ఎత్తేసేవారు. ఈ ఐపీఎల్ లో విజృంభిస్తాడని, ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించగలడనీ.. జట్టుకు కప్ అందించే సత్తా ఉన్న కెప్టెన్ అనీ.. అంచనాలు పెంచేశారు. దీంతో క్లాస్, కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అయిన KL రాహుల్ ను కాదని రిషభ్ పంత్ ను తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్.
అయితే మేనేజ్ మెంట్, అనలిస్టుల అంచనాలను తలకిందులు చేశాడు పంత్. అత్యంత చెత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇక మిగిలిన రెండే రెండు ఇన్నింగ్స్ తర్వాత ఏం పంత్ చేరుకోబోయే రికార్డ్స్ గురించి తెలుసుకుందాం.
ALSO READ | IPL 2025: నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై అమీతుమీ.. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
సోమవారం (మే 19) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో జరిగిన 61వ మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ నుంచి ఔట్ అయ్యింది. ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది లక్నో.
అయితే ఈ సీజన్‌లో లక్నో టీమ్ ఎదుర్కొన్న సమస్యలలో ముఖ్యమైన ప్రాబ్లమ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్. మెగా వేలంలో ఫ్రాంచైజ్ రూ.27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్.. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ అదే సమయంలో అత్యంత చెత్త రికార్డును కూడా సొంతం చేసుకోబోతున్నాడని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఈ ఐపీఎల్-2025లో ఏ దశలోనూ పంత్ రాణించలేదు. క్యాష్-రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. పంత్ ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో 11 ఇన్నింగ్స్‌లలో 12.27 సగటున.. 100 స్ట్రైక్ రేట్‌తో 135 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. వేలంలో భారీగా చెల్లించి పంత్ ను దక్కించుకున్న LSGకి ఇది ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.
ఏంటా చెత్త రికార్డు:
ఈ ఐపీఎల్ లో పంత్ సగటు 12.27. ఒక ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్‌గా రెండవ చెత్త రికార్డు ఇది. గతంలో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా ఇయోన్ మోర్గాన్ 11.08 యావరేజ్ తో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక కెప్టెన్ గా ఐపీఎల్ లో అంత తక్కువ స్కోర్ చేయడం ఫ్యూచర్ లో ఉండకపోవచ్చునని అనుకున్నారు. కానీ అదే బాటల్ పంత్ పయనిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
అయితే ఈ సీజన్ లో రిషబ్ పంత్ కు ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు ఇన్నింగ్స్ లో కూడా ఇలాగే ఉంటే.. మోర్గాన్ ను బీట్ చేయడం పక్కా. పంత్ ఫామ్‌ను బట్టి చూస్తే అదే జరుగుతుందేమోననే సందేహం కలగక మానదు.
IPL 2025 ను మోర్గాన్ కంటే చెత్త రికార్డు నమోదు కాకూడదంటే రాబోయే రెండు ఇన్నింగ్స్‌లలో తొమ్మిది కంటే ఎక్కువ రన్స్ చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి పంత్ బ్యాటింగ్ ఎలా ఉండనుందో.