ఇండియా- ఎ కెప్టెన్‌‌‌‌గా పంత్‌‌‌‌.. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా–ఎ తో రెండు టెస్టుల సిరీస్‌‌

ఇండియా- ఎ కెప్టెన్‌‌‌‌గా పంత్‌‌‌‌.. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా–ఎ తో రెండు టెస్టుల సిరీస్‌‌

న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న టీమిండియా వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌.. మళ్లీ బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. సౌతాఫ్రికా–ఎతో జరిగే నాలుగు రోజుల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో తలపడే ఇండియా–ఎ జట్టుకు సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌‌‌‌గా ఎంపిక చేశారు. ఈ నెల 30 నుంచి జరిగే రెండు టెస్ట్‌‌‌‌ల సిరీస్‌‌‌‌కు మంగళవారం (అక్టోబర్ 21) వేర్వేరు టీమ్స్‌‌ను  ప్రకటించారు. 

నవంబర్‌‌‌‌ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నేపథ్యంలో పంత్‌‌‌‌ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణను జట్టులో చేర్చారు. వీళ్లందరూ విండీస్‌‌‌‌తో జరిగిన టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో పాల్గొన్నారు. ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌ తర్వాత ఈ ఫార్మాట్‌‌‌‌కు దూరమైన పేసర్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌తో పాటు డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో బాగా ఆడిన గుర్నూర్‌‌‌‌ బ్రార్‌‌‌‌, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇచ్చారు. 

సౌతాఫ్రికా–ఎ టీమ్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌గా మార్క్స్ అకెర్మాన్‌ నియమించారు. ఈ సిరీస్‌‌‌‌లో సౌతాఫ్రికా రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ బవూమ కూడా బరిలోకి దిగుతున్నాడు. నవంబర్‌‌‌‌ 13 నుంచి 19 వరకు ఇండియా–ఎ జట్టు.. సౌతాఫ్రికా–ఎతో మూడు వన్డే మ్యాచ్‌‌‌‌లు కూడా ఆడనుంది. 

ఇండియా–ఎ జట్టు (తొలి మ్యాచ్‌‌‌‌కు): రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ఆయుష్‌‌‌‌ మాత్రే, ఎన్‌‌‌‌. జగదీశన్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌, హర్ష్‌‌‌‌ దూబే, తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌, మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌, అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌, యష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, ఆయుష్‌‌‌‌ బదోనీ, 
సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌. 

(రెండో మ్యాచ్‌‌‌‌కు): రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, హర్ష్‌‌‌‌ దూబే, తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌, మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, గుర్నూర్‌‌‌‌ బ్రార్‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌.