కాక రేపుతున్న పేపర్ల లీకేజీ వ్యవహారం.. సోషల్​ మీడియాలో మండిపడ్డ షర్మిల

కాక రేపుతున్న పేపర్ల లీకేజీ వ్యవహారం.. సోషల్​ మీడియాలో మండిపడ్డ షర్మిల

 తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి  పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని వైఎస్సార్​ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్​ వేదికగాఘాటుగా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయటంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా, ఇప్పుడు పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జితం నీటిపాలైనా దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టేనని సోషల్  మీడియా వేదికగా అన్నారు వైఎస్సార్​ టీపీ అధ్యక్షురాలు షర్మిల. . టీఎస్‌పీఎస్సీ బోర్డు అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు.. క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టినా ఈ సర్కారుకు సిగ్గురాదంటూ.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు . 

టీఎస్‌పీఎస్సీ స్కాం జరిగి, నెలన్నర దాటుతున్నా.. ఇప్పటివరకు ఒక్క రివ్యూ లేదు, మీటింగు లేదు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికారమదంతో పోలీసులను పంపించడం, హౌజ్ అరెస్ట్ చేయించడం.. ఇది మాత్రం చేతనైంది కేసీఆర్ కు అని ట్విట్టర్​లో విరుచుకు పడ్డారు. స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుంది. వెంటనే . టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని షర్మిల డిమాండ్​ చేశారు.  నిరుద్యోగుల మీద కేసీఆర్ కు  చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి, ఎంతటి దోషులనైనా కఠినంగా శిక్షించాలన్నారు షర్మిల.