హైదరాబాద్, వెలుగు: పరకాల నియోజకవర్గం ప్రజలకు సంబంధించింది అని, అది కొండా సుస్మిత ఎస్టేట్ కాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లి, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చే పిల్లకాయ మాటలు బంద్ చేయాలని కోరారు.
మూడు పార్టీలు మారి వచ్చిన కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ గౌరవించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నత స్థానం ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై స్థాయికి మించిన విమర్శలు చేయడం సుస్మిత మానుకోవాలని, పైగా కాంగ్రెస్లో సభ్యత్వం కూడా లేదన్నారు. సుస్మిత పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
