సర్కారు సరే అన్నా.. క్లాస్ రూం టీచింగ్ కు ఇంట్రెస్ట్ చూపని పేరెంట్స్

సర్కారు సరే అన్నా.. క్లాస్ రూం టీచింగ్ కు ఇంట్రెస్ట్ చూపని పేరెంట్స్
  • సర్కారు టీచర్లదీ ఇదే మాట
  • కరోనా పరిస్థితుల్లో టెన్షన్
  • నవంబర్ లేదా డిసెంబర్అయితే ఓకే
  • పేరెంట్స్ ఒపీనియన్ పై ప్రైవేట్ సూల్స్ సర్వేలు

హైదరాబాద్, వెలుగులాక్​డౌన్​తో నిలిచిపోయిన క్లాస్ ​రూమ్​ టీచింగ్​ను తిరిగి ఈ నెల 21 నుంచి ప్రారంభించాలన్న కేంద్రం ఆదేశాలతో పేరెంట్స్​ ఆలోచనలో పడ్డారు.  గ్రేటర్​లో అమలు చేస్తారా, లేదా అన్నది క్లారిటీ లేకపోయినా.. కరోనా పరిస్థితుల్లో ఇప్పడప్పుడే పిల్లలను స్కూల్స్​కి పంపేందుకు ఎక్కువమంది ఇంట్రస్ట్ గా లేరు. స్కూల్ బస్సులు, క్లాస్ రూమ్స్​లో ఫిజికల్​ డిస్టెన్స్, శానిటైజేషన్ వంటివి వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లాస్​కు హాజరైన స్టూడెంట్​కి వైరస్ ఎటాక్​ అయితే ఇంట్లో ఉండే వృద్ధులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. స్కూల్స్​ రీ ఓపెన్​పై పేరెంట్స్ ఓపీనియన్​ తెలుసుకునేందుకు ఇటీవల కొన్ని కార్పొరేట్ స్కూల్స్ సర్వేలు చేయగా.. 80 శాతం పేరెంట్స్ ఇప్పుడు స్కూల్​ కంటే ఇల్లే సేఫ్​ అని అభిప్రాయపడినట్టు మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. సర్కారు టీచర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సర్వేతో వైరస్ ​బారిన టీచర్లు

ఈ నెల ఒకటి నుంచి సర్కారు స్కూళ్లలో డిజిటల్​క్లాస్​లు మొదలయ్యాయి. వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం టీచర్లతో డోర్​ టు డోర్​ సర్వే చేయిస్తోంది. ఈ క్రమంలో రాష్ర్టవ్యాప్తంగా 600 మందికిపైగా టీచర్లు కరోనా బారిన పడ్డట్లు ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. హైదరాబాద్​ జిల్లాలో 30, రంగారెడ్డిలో 29, మేడ్చల్​లో45 మందికి పాజిటివ్​వచ్చినట్లు తెలిపాయి. బుక్స్​ పంపిణీ టైమ్​లోనూ కొందరు కరోనా బారిన పడ్డట్టు గుర్తుచేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న లంగర్​హౌస్​కి చెందిన హెచ్​ఎం చనిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో క్లాస్​రూమ్​ టీచింగ్ వద్దని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గైడ్ లైన్స్​ ఇలా..

21 నుంచి 9–-12 తరగతుల స్టూడెంట్స్​కి క్లాస్​రూమ్ ​టీచింగ్​ స్టార్ట్​ చేయాలన్న సెంట్రల్​ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్​ మినిస్ట్రీ గైడ్​లైన్స్​ కూడా రిలీజ్​చేసింది. స్టూడెంట్స్​, టీచర్లకి మాస్క్ ​మస్ట్ ​చేసింది. స్టూడెంట్స్​మధ్య 6 ఫీట్ల దూరం పాటించాలి. స్కూల్​లో విద్యార్థులు ఉమ్మి వేయకుండా జాగ్రత్త లు పాటించాలని పేర్కొంది. సిటీలోని చాలావరకు స్కూళ్లలో ఇరుకు గదుల్లోనే క్లాస్​లు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్​డిస్టెన్స్​ సాధ్యం కాకపోవచ్చని పేరెంట్స్​ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్​లో అయితే బెటర్​అంటున్నారు.

రిస్క్ తీసుకోలేం

కరోనా  పరిస్థితుల్లో పిల్లలను స్కూల్​ పంపి రిస్క్ ​తీసుకోలేం. ఆన్​లైన్​  క్లాసులు నడుస్తున్నాయి. వాటినే  కంటిన్యూ చేయిద్దాం అనుకుంటున్నాం.  కనీసం డిసెంబర్​ వరకైనా పిల్లలను స్కూల్స్​కి పిలవొద్దు.

-వినోద్​కుమార్​, పేరెంట్,​ సికింద్రాబాద్

గైడ్లైన్స్ పాటిస్తే ఓకే

ప్రతి క్లాసులో స్టూడెంట్స్​కి సంఖ్య 15కి మించకుండా క్లాస్​లు కండక్ట్​ చేస్తే బాగుం టుంది. డైలీ స్కూల్​ ఆవరణ, క్లాస్​ రూమ్​ శానిటైజ్​ చేయాలి. ఫిజికల్​ డిస్టెన్సింగ్​ ఏర్పాట్లు చేయాలి. అలాకాకుండా ఏదో నామమాత్రంగా నడిపితే టీచర్లు, స్టూడెంట్స్​ వైరస్​ బారినపడే ప్రమాదముంది.

-బి.రామకృష్ణ, డీటీఎఫ్ ​ఎడ్యుకేషన్ ​సెల్​ కన్వీనర్

పేరెంట్స్​ ఇంట్రెస్ట్​గా లేరు

స్కూల్స్ ​రీ ఓపెన్ చేస్తే పిల్లలను పంపుతారా అనే దానిపై పేరెంట్స్​ ఒపీనియన్​  తెలుసుకునేందుకు  కొన్ని క్వశ్చన్స్​తో ఒక ఫామ్ ని  తయారు చేసి పంపించాం. 80 శాతం పేరెంట్స్ ఇప్పుడే పంపించమని చెప్పారు. నవంబర్, డిసెంబర్​లో పంపుతాం అంటున్నారు.

రాధ, పల్లవి ఇనిస్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్