
మణుగూరు, వెలుగు: మద్యానికి బానిసై వేధిస్తున్న కొడుకును తల్లిదండ్రులు చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగింది. మణుగూరు సీఐ పాటి నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చేపల మార్కెట్ ఏరియాకు చెందిన రవికుమార్, పార్వతి దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు కుంజా మోహన్ కృష్ణ(22) మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతిగా మద్యం తాగి వచ్చి పేరెంట్స్‌పై దాడి చేయడంతో, వారు మోహన్ కృష్ణ మెడకు తాడు బిగించడంతో ఊపిరాడక చనిపోయాడు. మృతుడి భార్య పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.