బాలికను లైంగికంగా వేధించిన డ్యాన్స్ మాస్టర్ దేహశుద్ధి చేసిన పేరెంట్స్

బాలికను లైంగికంగా వేధించిన డ్యాన్స్ మాస్టర్ దేహశుద్ధి చేసిన పేరెంట్స్

 మేడిపల్లి పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికను లైంగికంగా వేధించిన డ్యాన్స్ మాస్టర్ ను దేహశుద్ది చేశారు. బోడుప్పల్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న ఒకటో తరగతి బాలికపట్ల కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు రవి. విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని దేహశుద్ది చేశారు. తల్లిదండ్రుల  ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిని, ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.