ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కూతురిని కిడ్నాప్ చేసిన పేరెంట్స్.. కళ్ళలో కారం కొట్టి..

ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కూతురిని కిడ్నాప్ చేసిన పేరెంట్స్.. కళ్ళలో కారం కొట్టి..

ఈరోజుల్లో ప్రేమ వివాహాలు కామన్ అయిపోయాయి. పెద్దలను ఎదిరించి చేసుకునే ప్రేమ వివాహాలు కొన్ని అయితే.. పిల్లల ఇష్టాలను గౌరవించి పెద్దల అంగీకారంతో జరిగే ప్రేమ పెళ్లిళ్లు మరికొన్ని. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత రాజీ పడుతుంటారు కొంతమంది పేరెంట్స్. మరికొంతమంది పరువే ముఖ్యమని ఫీలయ్యి హత్యలకు సైతం వెనకాడట్లేదు. కీసరలో ఇలాంటి ఘటనే జరిగింది.కీసరలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కన్న కూతురినే కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన. బుధవారం ( సెప్టెంబర్ 24 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  

నాలుగు నెలల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది శ్వేత. తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందని శ్వేతపై కోపం పెంచుకున్న తల్లిదండ్రులు బాల నర్సింహ, మహేశ్వరిలు.. కూతురినే కిడ్నాప్ చేశారు.

►ALSO READ | నా కళ్లు చెమ్మగిల్లాయి..నా జన్మకి ఇంత కంటే గొప్ప ఆనందం లేదు

ఇవాళ తెల్లవారుజామున ప్రవీణ్ ఇంటికి వెళ్లి బంధువుల సాయంతో శ్వేతను కిడ్నాప్ చేసారు. ప్రవీణ్, శ్వేత ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో తెల్లవారుజామున అబ్బాయి ఇంటిపై దాడి చేశారు శ్వేత తల్లిదండ్రులు. శ్వేత కళ్ళలో కారంపొడి చల్లి.. బట్టలు కట్టి ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భర్త ప్రవీణ్ . ప్రవీణ్ ఫిర్యాదుతో శ్వేత తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.