
పేదోడి గృహ ప్రవేశంతో తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. .ఈ రాష్ట్రం లో ఇన్ని ఇళ్లు కట్టించే భాగ్యం తనకు వచ్చిందన్నారు. నా జన్మకి ఇంత కంటే గొప్ప ఆనందం లేదని అన్నారు. విడతలు వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మనం చేసే మంచి పనులే శాశ్వతమైనవి..పదవులు శాశ్వతం కాదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సేవ చేసే ఇళ్ల శాఖ సీఎం రేవంత్ రెడ్డి తనకిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పి..కాలయాపన చేసే ప్రభుత్వం కాదన్నారు పొంగులేటి. అధికారంలోకి రాగానే పేదోడి కల నేరవేరే విధంగా పేదోడి ఆత్మగౌరవం, ధైర్యం,స్థైర్యం కోసం ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామన్నారు. 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేశాం ప్రతి నియోజకవర్గంలో3 వేల 500 ఇళ్లు ఇచ్చామని చెప్పారు పొంగులేటి.
రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి . ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కి బిల్లులు వేస్తున్నామన్నారు. పదేళ్ళలో ఏడాది లక్ష ఇళ్లు కట్టించినా పది లక్షలు ఇళ్లు పూర్తి అయ్యేవని చెప్పారు. ధనార్జన కోసం కమిషన్ ల కోసం ధనిక రాష్ట్రంలో ఇళ్లు కట్టకుండా కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కమిషన్ వేస్తే దేశంలో 8 వింత అని ప్రచారం చేసిన కాళేశ్వరం భాగోతం బట్టబయలు అయ్యిందన్నారు.