
కోనరావుపేట,వెలుగు: కోనరావుపేట మండలం కనగర్తి ప్రైమరీ స్కూల్(ఎస్టీకాలనీ)లో టీచర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు కలెక్టర్, డీఈవోను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీ కాలనీ స్కూల్‌లో 23 మంది విద్యార్థులున్నారని, స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్‌పై వేరే స్కూల్‌కు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులకు చదువు చెప్పే వారు లేకుండా పోయారన్నారు.