స్కూల్ సీజ్.. పేరెంట్స్ ఆందోళన

స్కూల్ సీజ్.. పేరెంట్స్ ఆందోళన

బషీర్​బాగ్​, వెలుగు: అనుమతులు లేకపోవడంతో  కోఠిలోని శ్రీచైతన్య స్కూల్ ను అధికారులు కొన్ని రోజుల క్రితం సీజ్​ చేశారు. దీంతో ఆ స్కూల్​లో చదివే పిల్లల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్ ను అకస్మాత్తుగా మూసేయడంతో 300 మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. 

దీనిపై నిలదీస్తే వేరే బ్రాంచ్ లో చేరాలని స్కూల్ ఎంజీఎం కృష్ణ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే బ్రాంచ్ అనుమతులతో కోఠిలో ఏడాదిగా స్కూల్ నడుపుతున్నారని, ఆ విషయం ఎందుకు దాచారని మండిపడ్డారు. స్కూల్ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు వేరే బ్రాంచ్ కు ఎలా వెళ్తామని నిలదీశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోని, తమ పిల్లలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.