పిల్లల్నిఇప్పుడే బడికి పంపం..ఏడాది వేస్ట్ అయినా సరే..

పిల్లల్నిఇప్పుడే బడికి పంపం..ఏడాది వేస్ట్ అయినా సరే..
  • ఏడాది వేస్ట్ అయినా సరే..రిస్క్ తీసుకోలేమంటున్న 71%  పేరెంట్స్
  • అక్టోబర్​లో బడులు తెరిచినా పంపించమంటున్నరు
  • 20 శాతం తల్లిదండ్రులు మాత్రమే ఓకే అంటున్నరు
  • వచ్చే ఏడాదే బడులు తెరవాలని 34% మంది ఒపీనియన్
  • ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, వెలుగుకరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉండటంతో తమ పిల్లలను బడికి పంపేందుకు చాలామంది పేరెంట్స్ బుగులు పడుతున్నరు. ఈ అకడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయినా సరే.. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను స్కూలుకు పంపబోమని కొందరు స్పష్టం చేస్తున్నరు. ఈ నెల15 నుంచి స్కూళ్లు తెరవొచ్చని, పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ లో వెల్లడించింది. అయితే, స్కూళ్లను తిరిగి తెరిచినా.. ఇప్పుడే తమ పిల్లలను పంపబోమని71 శాతం మంది పేరెంట్స్ చెప్తున్నరు. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు 20 శాతం మంది పేరెంట్స్​ ఓకే అంటున్నరు.ఇంకొందరేమో.. అసలు ఈ అకడమిక్ ఇయర్ లో స్కూళ్లు ఓపెన్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. నోయిడాకు చెందిన ‘లోకల్‌‌ సర్కిల్స్‌‌’ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

71శాతం పేరెంట్స్‌‌ నో..

మార్చి 15 నుంచి విద్యాసంస్థలన్నీ బంద్‌‌ అయ్యాయి.  తర్వాత లాక్‌‌డౌన్‌‌ సడలింపుల్లో భాగంగా అకడమిక్ ఇయర్ మిస్‌‌ కావొద్దన్న ఉద్దేశంతో ఆన్‌‌లైన్‌‌ క్లాసులకు అనుమతించారు. విద్యార్థులకు ఆన్‌‌లైన్‌‌ క్లాసులు నడుస్తున్నాయి. అక్టోబర్‌‌లో స్కూళ్లు తిరిగి ప్రారంభం కానుండటంతో ‘లోకల్‌‌ సర్కిల్స్‌‌’ సంస్థ దేశవ్యాప్తంగా 217 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. ఫోన్ ద్వారా14.5 వేల మందికి పైగా పేరెంట్స్‌‌ను ఇంటర్వ్యూ చేసి వివరాలను సేకరించింది. అక్టోబర్‌‌లో తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తారా? అన్న ప్రశ్నకు 71 శాతం మంది తల్లిదండ్రులు నో చెప్పారు. 20 శాతం మంది పేరెంట్స్‌‌ మాత్రమే ఓకే చెప్పారు. మిగతా 9 శాతం మంది ఎలాంటి
ఒపీనియన్‌‌ చెప్పలేదు.

34% మంది ఈ ఏడాది వద్దంటున్నరు.. 

ఈ ఏడాది పూర్తయ్యేదాకా బడులు తెరవొద్దని పేరెంట్స్ కోరుకుంటున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు తెరవొద్దని 32 శాతం మంది పేరెంట్స్‌‌ చెప్పారు. అసలు ఈ అకడమిక్‌‌ ఇయర్‌‌ అవసరమే లేదని34 శాతం మంది తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఇక 7 శాతం మంది మాత్రం అక్టోబర్‌‌లో స్కూళ్లు ఓపెన్‌‌ చేయాలని, 9 శాతం మంది డిసెంబర్‌‌లో తెరవాలని అభిప్రాయపడ్డారు. అంటే మొత్తంగా డిసెంబర్‌‌ 31 కంటే ముందు స్కూల్స్‌‌ రీఓపెన్‌‌ చేయడానికి 28 శాతం పేరెంట్స్‌‌ ఇంట్రెస్ట్ చూపించారు. 34 శాతం మంది మాత్రం వచ్చే విద్యా సంవత్సరం (ఏప్రిల్‌‌ 2021)నుంచే స్కూళ్లు నడపాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరో సర్వేలో.. స్కూళ్లకు 78% పేరెంట్స్ నో

చెన్నైకి చెందిన ‘ఎస్పీ రోబోటిక్స్ వర్క్స్’ అనే మరో సంస్థ కూడా దేశవ్యాప్తంగా 3,600 మంది పేరెంట్స్, అంతే సంఖ్యలో పిల్లల(7 నుంచి 17 ఏళ్లలోపు)పై ‘కిడ్స్ అండర్ కొవిడ్’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ నెలలో స్కూళ్లు తెరిచినా.. తమ పిల్లలను పంపబోమని 78% పేరెంట్స్ ఈ సర్వేలో వెల్లడించారు. శాలరీ వస్తున్న పేరెంట్స్ లో 17%, సెల్ఫ్​ ఎంప్లాయ్ మెంట్ ఉన్నోళ్లలో 30%, ఫ్రీలాన్స్ వర్కర్లలో 56% మంది పిల్లలను బడికి పంపేందుకు సిద్ధమన్నారు. 64% మంది ఆన్ లైన్ స్కూలింగ్ వద్దన్నారు. లాక్ డౌన్ లో 23% మంది తమ పిల్లలు ఆన్ లైన్ రోబోటిక్స్ క్లాస్ లకు అటెండ్ అయ్యేందుకు మొగ్గు చూపారు. ఇక కరోనా విపత్తు వల్ల 40% పిల్లలు యాంగ్జైటీతో బాధపడ్డారని, చాలా మంది పిల్లల మెంటల్, ఫిజికల్ హెల్త్ పై ఎఫెక్ట్ పడిందని సర్వేలో తేలింది.