కరోనాతో తప్పించుకొచ్చిన కొడుకుని పోలీసులకు పట్టించిన తల్లిదండ్రులు

కరోనాతో తప్పించుకొచ్చిన కొడుకుని పోలీసులకు పట్టించిన తల్లిదండ్రులు

కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ నుండి తప్పించుకొని సొంతూరుకు చేరుకున్న వ్యక్తిని.. తల్లిదండ్రులే పోలీసులకు పట్టించిన ఘటన ఏపీలో జరిగింది. జంగారెడ్డి గూడెంకు చెందిన వ్యక్తి.. హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. అయితే అతనికి కరోనా సోకడంతో.. నగరం నుంచి అక్రమంగా ఏపీలోని తన సొంతూరుకు వెళ్లాడు. ఊరి దగ్గర్లోకి వెళ్లిన తర్వాత కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్రత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అశ్వారావు పేట పరిధిలోని జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నందమూరి కాలనీ, ఆంజనేయ స్వామి గుడి వద్ద పేషంట్ కి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరోనా సోకిన వ్యక్తి తన ప్రయాణానికి వాడిన బైకును కూడా పోలీసులు అక్కడే వదిలి వెళ్లారు. దాంతో విషయం తెలిసిన కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

For More News..

వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నాకు సీఎం పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ..

అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా సోకినట్లు గుర్తింపు